ఇదీ మన రామజన్మభూమి
అయోధ్య.. ఈ పేరు వినగానే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది. భారతజాతి లో ఉదయించిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పుణ్యభూమి ఇది. అవతారపురుషుడైన రాముడు సూర్యవంశ తిలకునిగా భూమిపై కాలుమోపిన ధన్యభూమి అయోధ్య. అనేక వందల ఏళ్లపాటు హిందువులు చేసిన త్యాగాలు పోరాటాల ఫలితంగా.. ఇక్కడ రామాలయ నిర్మాణానికి జాతి స్థిరసంకల్పంతో నిలబడింది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఇది రామజన్మభూమేనని నిర్ద్వంద్వముగా తేలింది. ఈ పవిత్ర తరుణంలో.. విద్వాంసులు నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం శ్రీరామజన్మభూమి అయోధ్యలో రామ్ లాలా సుందర భవ్య మహాలయనిర్మాణానికి అంతా సిద్ధమైంది. 2020 ఆగస్టు 5 వ తేదీన రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో నాటి అయోధ్యానగరం.. నేడు ఎలా ఉందనేది కళ్ళకు కట్టే రీతిలో ఈ చిత్రాలను తిలకించండి. (IRA NEWSPAPER)