X Close
X
9440451836

ఉగ్రవాద ఖాతాలకు ట్విట్టర్ టాటా


076ea1_28afdc5e0265411e9b1f02e65a7f90b6~mv2
Rajahmundry:ఉగ్రవాదాన్ని, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించినందుకు గానూ దాదాపు 1.6లక్షల ఖాతాలను తొలగించినట్లు ట్విటర్ వెల్లడించింది. 2018 జులై-డిసెంబరు మధ్య 1,66,513 ఖాతాలను రద్దు చేసినట్లు పేర్కొంది. గతేడాది జనవరి - జూన్ కాలంతో పోలిస్తే జులై - డిసెంబరు మధ్య ఉగ్రవాద సంబంధిత ట్వీట్లు 19శాతం తగ్గాయని కంపెనీ లీగల్ హెడ్ విజయా గడ్డె తన బ్లాగు పోస్టులో తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా, జపాన్, భారత్ సహా పలు దేశాలు ట్విటర్ను కోరాయి. దీంతో ట్విటర్ ఈ చర్యలు చేపట్టింది.