X Close
X
9440451836

టైమ్ కథనాల వెనుక మతలబు


076ea1_4676e80e28cb4736a0acb17fd09ff526~mv2
Rajahmundry:కొద్ది నెలల క్రితం అమెరికా నిఘా సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం భారత్ లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మత కలహాలు జరుగుతాయట.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల చివరి దశ ఘట్టంలో ఉన్నాం.. ఇప్పటి వరకూ ఎక్కడైనా మత ఘర్షణలు జరిగాయా? .. 19వ తేదీన చివరి దశ పోలింగ్ ఉంది.. ఈలోపు కూడా జరిగే అవకాశం లేదు.. అసలు విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోదీని India's divider-in-chief (భారత విభజన సారథి)గా పేర్కొంటూ TIME అనే అంతర్జాతీయ పత్రిక ఒక వ్యాసం రాసింది.. ఈ వ్యాసం రాసింది పాకిస్తాన్ జాతీయుడైన అతీశ్ తసీర్ అనే రచయిత.. ఇతని తల్లి తవ్లీన్ సింగ్ అనే భారతీయ జర్నలిస్టు.. పాకిస్తాన్ కు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సల్మాన్ తసీర్ తో ఆమె కొంత కాలంగా సహజీవం చేసిన సమయంతో అతీశ్ తసీర్ పుట్టాడు.. మోదీ అన్ని రంగాల్లోవిఫలమయ్యాడంటూ టైమ్ మ్యాగజైన్ లో రాశాడు.. బహుశా ఆ పత్రిక వారికి మోదీకి వ్యతిరేకంగా రాసేందుకు భారత్ బద్దశత్రువైన పాకిస్తానీయే దొరికాడే.. టైమ్ పత్రిక ఇదే సంచికలో ఇయాన్ బ్రెమ్మర్ అనే రచయిత రాసిన Modi the Reformer అనే అనుకూల కథనాన్ని కూడా ప్రచురించింది.. ఇండియా డివైటర్ ఇన్ చీఫ్ అనే కథనాన్ని చూసిన కాంగ్రెస్ నేతలు తొలుత చంకలు గుద్దుకొని టైమ్ ముఖచిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తీరా ఆ పత్రికలో కాంగ్రెస్ పై కూడా విమర్శలు ఉండటంతో నాలిక కరచుకున్నారు.. గతంలో టైమ్ పత్రిక ప్రధాని మోదీని పొగుడుతూ స్వయంగా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యాసం కూడా రాయించింది.. అప్పుడు అనుకూలంగా రాసిన పత్రిక ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు రాసిందని అనుకుంటున్నారా?.. ప్రతి దేశానికీ, రాజకీయ పార్టీకి ఎజెండా ఉన్నట్లే అంతర్జాతీయ పత్రికలకూ ఉంటుంది.. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ దేశానికి రావడానికే అనుమతించలేదు అమెరికా.. 2014 ఎన్నికల్లో భారత ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారికి దిమ్మ తిరిగిపోయింది.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, మార్కెట్ ఉన్న ఇండియాతో తమ అవసరాల రీత్యా మోదీని ప్రసన్నుడిని చేసుకోవడానికి అగ్ర రాజ్యం ఎన్ని తంటాలు పడిందో మనం గమనించవచ్చు.. ఇప్పుడు మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.. ఈ క్రమంలో ఇలాంటి కథనాల వెనుక ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.. విదేశీ శక్తులు మీడియాను అడ్డం పెట్టుకొని మోదీపై దుష్ప్రచారం చేయడం వెనుక ఉన్న కుట్ర సుస్పష్టం.. అదృష్టవశత్తు విదేశీ మీడియా ప్రభావం మన దేశ ఓటర్లపై పెద్దగా ఉండదు.. మన వారు ఎక్కువగా ప్రాంతీయ భాషా మీడియాపైనే ఎక్కువగా ఆధారపడతారు.. కానీ ప్రాంతీయ భాషా మీడియా విదేశీ పత్రికల కథనాలకు పెద్ద పీట వేయడం వెనుక మతలబును కూడా మనం అర్థం చేసుకోవాలి.. ఏది ఏమైప్పటికీ మన జుట్టు విదేశీయుల చేతికి అందకుండా చూసుకోవడమే మందిచి.. దేశీయంగా ఉండే సమస్యల ప్రభావం మనపై కచ్చితంగా ఉంటుంది.. విదేశీయుల సొంత ప్రయోజనాల దృష్టికోణం మనకు ఎందుకు? నీతి: TIMEకి (కాలానికి) అనుగుణంగా ప్రయోజనాలు మారిపోతుంటాయి..