X Close
X
9440451836

తృణమూల్ కార్యకర్తలే దాడులకు బాధ్యులు


076ea1_05a1c318a81b441d916d47147543683a~mv2
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతు న్నారని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ర్యాలీ నేపథ్యంలో మంగళవారం బంగాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై షా మీడియాతో మాట్లాడుతూ బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతా బెనర్జీదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతు న్నారు. అక్రమంగా పోలింగ్ బూత్ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారు అని మండిపడ్డారు. మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం. గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. దీనికి తృణమూల్ కాంగ్రెసే బాధ్యత వహించాలి అని అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మంగళవారం కోల్కతాలో రోడ్ షో నిర్వహించగా.. తీవ ఉద్రిక్తత చోటుచేసుకుంది. షా రోడ్ షోకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. దీంతో రెచ్చిపోయిన భాజపా కార్యకర్తలు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. (IRA NEWSPAPER)