X Close
X
9440451836

పురోహితులను ఆదుకోండి


076ea1_75179c6feea142e39235df7d879eb3af~mv2
Rajahmundry:పౌరోహిత్యాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పురోహిత బ్రాహ్మణులకు ఈ కరోనా కాలంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని అందుకే ప్రభుత్వం ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని జిల్లా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ దీక్షితుల రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేస్తూ... కరోనా నిబంధనల వలన పనులు కోల్పోయి ఎందరో పురోహితులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ,ఇలాంటి సమయంలో ప్రభుత్వం కల్పించుకుని వారికి భరోసా ఇవ్వాలని కోరారు. కరోనా కష్టకాలంలో అందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం పురోహితులను మాత్రం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో లక్షా 20వేల పురోహిత కుటుంబాలున్నాయని, వారికి పనులు లేక జీవనం సాగించలేక అగచాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్బంగా విశాఖ పట్నంలో నిర్వహించిన బ్రాహ్మణ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఇటువంటి కీలక సమయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం గా ఉండడం బాధాకరమని ఆయన వాపోయారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ని పటిష్టం చేసి, పురోహిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.