X Close
X
9440451836

ప్యాట్ల లెక్కింపు పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం


076ea1_607423b798a64a4883150ded1aa4369b~mv2
Rajahmundry:సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు 100శాతం సరిపోలేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది అనవసర పిటిషన్ అని, దీన్ని విచారించబోమని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చెన్నైకు చెందిన టెక్ ఫర్ ఆల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించింది. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్ తీసుకొచ్చారు అని ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకునే వీవీప్యాట్ల సంఖ్యను కనీసం 50శాతానికి పెంచాలంటూ ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.