మళ్ళీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కరోనానుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత రెండోసారి ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడడంతో గురుగ్రామ్లోని మెదంతా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం తీవ్ర అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా వైద్యుల సలహా మేరకు ఆగస్టు 18న ఎయిమ్స్లో చేరారు. 13 రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆగస్టు 31న ఇంటికి వెళ్లారు. అయితే మరోసారి ఆయన ఆరోగ్యం తిరగబెట్టటంతో శనివారం రాత్రి 11గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. (IRA NEWSPAPER)