మాల్యా అప్పగింతకు లండన్ కొత్త మెలిక
విజయ్ మాల్యాను భారత్కు అప్పగించే విషయంలో యూకే ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదనీ.. పెండింగ్లో ఉన్న సమస్య పూర్తయ్యే వరకు మాల్యాను భారత్కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది. అయితే ఆ సమస్య ‘‘రహస్య’’మని పేర్కొంది. ‘‘ దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తాం..’’ అని పేర్కొంది. (IRA NEWSPAPER)