X Close
X
9440451836

ములాయం, అఖిలేష్ లకు సిబిఐ క్లీన్ చిట్


076ea1_857ce596b27547cb9c1735970c404631~mv2
Rajahmundry:ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. పోలింగ్ ముగిసాకా, సరిగ్గా కౌంటింగ్ కి ఒకరోజు ముందు ఈ చర్య చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎనభై సీట్లున్న యుపి లో బిజెపి ప్రదర్శన అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని అభిప్రాయం నెలకొన్న తరుణంలో అక్కడి మరో ప్రధాన పార్టీ నేతలకి ప్రభుత్వంపక్షాన ఈ కానుక అందడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కేసులే ఎదుర్కొంటున్నారు. త్వరలో ఆయన విషయంలోనూ ఇది జరగబోతున్నది అని ఆ పార్టీ వర్గాల్లో సంబరం కనిపిస్తోంది. అయితే అఖిలేష్, ములాయం కేసుని కోర్టు కొట్టేస్తే కాస్త పద్ధతిగా ఉండేదని, నేరుగా ప్రభుత్వ సంస్థ సిబిఐ వారే క్లీన్ చిట్ ఇస్తూ అఫిడవిట్ ఇవ్వడం కర్కెటు కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పార్లమెంటు చివరి సమావేశాల్లో ములాయం సింగ్ యాదవ్ ప్రధాని నరేంద్రమోడీ ని మెచ్చుకుంటూ మాట్లాడి సంచలనమ్ సృష్టించారు. దాని ఆంతర్యం ఇదే కావచ్చనే అనుమానాలు ఇప్పుడు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. రేపు సంకీర్ణానికి అవసరమైతే అఖిలేష్ అండ్ కో సపోర్టు ఇస్తే లేదా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సహాయ నిరాకరణ చేస్తే.. ఈ పరిణామాన్ని క్విడ్ ప్రో కో కిందే అర్థం చేసుకోవాలని మేధావులు మండిపడుతున్నారు. నిజాయితీపరుడైన నరేంద్ర మోడీ నుంచి ఇలాంటి చర్యని తాము ఊహించలేదని అంటున్నారు.