రాజమండ్రి అటవీ సర్కిల్ లో నెల లోపే కారుణ్య నియామకం
Rajahmundry:నియామకపత్రం అందజేసిన పిసిసిఫ్( (HoFF) ప్రతీప్ కుమార్ ఉద్యోగికి రిటైర్మెంట్ రోజునే పెన్షన్ అలాట్ మెంట్ లెటర్ ఇవ్వడం ద్వారా గత జులై లో అద్భుతాన్ని సాధించి చూపిన అటవీ శాఖ రాజమండ్రి సర్కిల్ ఇప్పుడు మరో అసాధారణ చర్యతో తన మానవత్వాన్ని చాటుకుంది. అటవీశాఖలో ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన ఉద్యోగి భార్యకు నెల రోజుల్లోపే కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సన్నివేశం శుక్రవారం రాజమండ్రి అటవీ సర్కిల్లో చోటు చేసుకుంది. రాష్ట్ర అటవీ దళాధిపతి, పిసిసిఎఫ్ ఎన్ ప్రతీప్ కుమార్ ఈ ఉత్తర్వులను అందజేశారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అయితాబత్తుల శ్రీనివాసరావు విజయవాడలోని అటవీ శాఖ కార్యాలయంలో టెక్నీకల్ ఆఫీసర్ గా పని చేస్తూ 11-7-2020 న మరణించారు. కారుణ్య నియామకం కోరుతూ ఆయన భార్య యు. దుర్గాదేవి ఆగస్టు 31 న దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మీదట విజయవాడ డివిజన్ కార్యాలయంలో పోస్టు వేకెన్సీ లేకపోవడంతో దరఖాస్తును రాజమండ్రి సర్కిల్ కార్యాలయానికి పంపారు. సత్వర చర్యలు తీసుకోవాలన్న అటవీ దళాధిపతి సూచన మేరకు రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు కేవలం వారం రోజుల్లోనే అన్ని పరిశీలనలు, చర్యలు పూర్తి చేసి ఆమెను రాజమండ్రి అటవీ సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేసారు. మృతుడు శ్రీనివాసరావు కుటుంబాని కి సత్వర న్యాయం చేయడం కోసం సకాలంలో పరిశీలన జరిపిం చి అతి తక్కువ సమయంలో అతడి భార్యకు అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ఇక్కడ విశేషం. మృతుడు శ్రీనివాస రావు షెడ్యూల్డ్ కులస్తుడు, నిరుపేద నేపథ్యానికి చెందినవాడు కావడం ఇక్కడ గమనార్హం. మృతుని భార్యకు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా అటవీ దళాధిపతి ప్రతీప్ కుమార్ మాట్లాడుతూ శాఖ ఉద్యోగులు ఎవరు మరణించినా సకాలంలో స్పందించడం జరుగుతుందని, బాధిత కుటుంబాలు ఎటువంటి ఇబంది పడకుండా అన్ని చర్యలూ తీసుకుని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకోసం, ప్రభుత్వ లక్ష్యాల కోసం అహరహం శ్రమించే ఉద్యోగుల సంక్షేమాన్ని శాఖ ఉన్నతాధి కారులు సదా కనిపెట్టుకొని అంటారన్నారు. రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి, పలువురు డి ఎఫ్ ఓ లు కార్యక్రమంలో ఉన్నారు.