రైతు కష్టానికి ఇదీ పరిష్కారం
ప్రతి పంటకీ ముందే కనీస గిట్టుబాటు (పెట్టుబడి+ ప్రతిఫలం) ధర నిర్ణయించి.. కోతలు పూర్తవగానే పండిన పంటకి ప్రభుత్వం ఆ ధర ముందే చెల్లించడం.. ఆపైన పంటని ప్రభుత్వ యంత్రాంగమే సత్వరం తోలుకుపోవడం జరగాలి. పంటకాలంలో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం వాటిల్లితే తక్షణం పూర్తి పంటనష్టాన్ని రైతుకు పరిహారంగా ఇవ్వాలి. సాగు మనుగడకు ఇవే పరిష్కారాలు అని చెప్పడానికి సాధారణ పరిశీలన, పరిస్థితిపై ప్రత్యక్ష అవగాహనా చాలు.. పెద్ద పెద్ద సమీక్షలు, నివేదికలు, కమిటీలు.. ఏవీ అక్కరలేదు. ఈ రెండు నిర్ణయాలూ జరిగి, అమలైతే తప్ప వ్యవసాయం బతకదు. చిత్తశుద్ధి ఉంటే ఇది పెద్ద కష్టం కూడా కాదు. పంట ధర నిర్ణయాధికారం, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి స్వేచ్ఛ.. ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి.. ఆచరణకు అసాధ్యాలు! (IRA NEWSPAPER)