X Close
X
9440451836

సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు


076ea1_f903df008361443d817d29e8a414a027~mv2
భారత సుప్రీం కోర్టుకి వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. మే 13 నుంచి 20వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం, మే 21 నుంచి 24 వరకు జస్టిస్ అరుణ్మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్ 2వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 3నుంచి జూన్ 5వరకు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 6 నుంచి జూన్ 13 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం పని చేస్తాయి. జూన్ 14 నుంచి జూన్30 వరకు ధర్మాసనాల వివరాలను త్వరలో వెల్లడిస్తారు. జులై 1 నుంచి సుప్రీం కోర్టు తిరిగి పని చేస్తుంది. (IRA NEWSPAPER)