X Close
X
9440451836

కరోనా ఎఫెక్ట్ .. నేవీ మిలన్ వాయిదా.. ప్రధాని సమీక్ష


076ea1_8f46cfbbc8f64e4eb35fa679af90e06b~mv2
దేశంలో ఒకే రోజు మూడు కరోనా (కొవిడ్-19) కేసులు వెలుగుచూసిన మరుసటి రోజు మంగళవారం ఆగ్రాలో ఆ వైరస్ లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్న మరో ఆరుగురిని గుర్తించారు. వీరిని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రి ఇసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆగ్రాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ‘హై-వైరల్ లోడ్’ కేసులను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరి శాంపిళ్లను పుణెలోని లేబొరేటరీకి పంపారు. వీరంతా కరోనా వైరస్ సోకినట్లు సోమవారం నిర్ధారణ జరిగిన ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తితో సన్నిహితంగా మెలిగారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాక ఆగ్రా వెళ్లి ఈ ఆరుగురిని కలిసినట్లు గుర్తించారు. ఢిల్లీ వ్యక్తితో పాటు హైదరాబాద్, జైపూర్లో రెండు కరోనా కేసులను గుర్తించిన సంగతి తెలిసిందే. జైపూర్లో వ్యాధి నిర్ధారణ జరిగిన వ్యక్తి ఇటలీకి చెందిన పర్యాటకుడు. మంగళవారం అతని భార్యకు కూడా కరోనా సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నియంత్రణకు సన్నద్ధతపై మంగళవారం ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని ట్విటర్లో తెలిపారు. భారత్కు వస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం దగ్గర్నుంచి సరైన వైద్య సహాయం అందించేవరకు సమష్టిగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్లు కరోనా వైర్సను చంపేస్తాయన్న ప్రచారంతో ముంబైలో వాటికి తీవ్ర కొరత ఏర్పడింది. విశాఖపట్నంలో ఈ నెల 18-28 వరకు నావికా దళం నిర్వహించతలపెట్టిన ‘మిలన్-2020’ వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో 40 దేశాలు పాలొనాల్సి ఉంది. (IRA NEWSPAPER)