X Close
X
9440451836

నాగబాబు కబుర్లు !


Rajahmundry:చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సోదరుడు నాగబాబు చెప్పిన కొన్ని విషయాలు!!- తమ్ముడు పవన్ కోసం చిరంజీవి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు.- అన్నదమ్ములిద్దరం ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు.- రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా సేవలు చేయగలడని చిరంజీవి నమ్మకం.- పవన్ కి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తాను ఆ రంగంలో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు- చిరంజీవికి ఓ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందనే ప్రచారంలో వాస్తవం లేదు.- మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు.- ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు.- పవన్ కల్యాణ్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్థిస్తారు.- చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినిమా రంగానికే అంకితం చేయాలని నిర్ణయించారు. అందుకే రాజకీయాలను వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టారు.- మా కుటుంబంలోని నటులందరికంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారు.- చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం లభిస్తుంది.. రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం చిరంజీవికి లేదు.- చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయి.