X Close
X
9440451836

రష్యాలో విమాన ప్రమాదం.. 41 మంది మృతి


076ea1_34799aace683438fa6c18633353b86fe~mv2
రష్యాలో మాస్కో విమానాశ్రయంలో ఓ విమానం క్రాష్ లాండింగ్ ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు గాయపడినట్లు విచారణ కమిటీ వెల్లడించింది. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. అవి కొద్దిసేపటికే విమానం వెనుక భాగాన్ని ఆవరించాయి. వీటిలో చిక్కుకొని ప్రయాణికులు 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 78 మంది విమానంలో ఉన్నారు. ఆహుతవగా మిగిలిన 37 మంది విమానం ముందువైపు ద్వారం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. టేకాఫ్ అయిన తర్వాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనేది తెలియరాలేదు. టేకాఫ్ అయిన తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు విమానం మాస్కోలో రెండు సార్లు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ‘ఫ్లైట్ రాడార్ 24’ పేర్కొంది. దీనిపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. (IRA NEWSPAPER)